యెమన్లో శాంతి స్థాపనకు సౌదీ కొత్త ప్రతిపాదనలు

- March 23, 2021 , by Maagulf
యెమన్లో శాంతి స్థాపనకు సౌదీ కొత్త ప్రతిపాదనలు

సౌదీ:ఆరేళ్లుగా రావాణకాష్టంలా రగలిపోతున్న యెమెన్లో శాంతి స్థాపనకు సౌదీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. యెమెన్లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని కింగ్డమ్ విదేశాంగ మంత్రి ప్రతిపాదించారు. అలాగే వాయు, జల మార్గాలపై నిషేధాన్ని కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోభాగంగా సనలోని ఎయిర్ పోర్టు, హోడైడాలోని నౌకాశ్రయం మీదుగా చమురు, అహార దిగుమతులు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. సౌదీ ప్రతిపాదనలను అంతర్జాతీయ సమాజం గుర్తించిన యెమన్ ప్రభుత్వం కూడా స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు, తిరికి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హౌతీ తిరుగుబాటుదారులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సౌదీ ప్రతిపాదనలకు హౌతిస్ సానుకూలంగా స్పందించిన పక్షంలో కాల్పుల విరమణ, జల, వాయు రవాణాపై నిషేధం ఎత్తివేత అమలులోకి రానున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com