పవన్ - రానా డెడ్లీ కాంబో..పాట పాడనున్న పవన్
- March 23, 2021మన స్టార్ హీరోలలో ఎక్కువ పాటలు పాడిన స్టార్ ఎవరంటే టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణే గుర్తుకు వస్తారు. ఇప్పటి వకూ ఆయన 'తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి' చిత్రాల్లో పాటలు పాడారు. ఆ పాటల వల్ల ఆ యా సినిమాకు ఎంతో క్రేజ్ కూడా వచ్చింది.
ఇక ఇప్పుడు మరోసారి పవన్ గొంతు సవరించుకోబోతున్నారు. రాబోయే 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో పవన్ మరోసారి పాట పాడబోతున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ నిర్ధారించారు కూడా. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తయిందట. ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా డబ్బింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం