సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని ఖతార్ క్లారిటీ
- March 23, 2021ఖతార్: కోవిడ్ వ్యాక్సిన్ తో యువతీ, యువకుల సంతానోత్సత్తి అవకాశాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆరోపణలను ఖతార్ ప్రభుత్వం కొట్టిపారేసింది. సంతానోత్పత్తి విషయంలో పురుషులు, మహిళలపై వ్యాక్సిన్ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ ఇటీవల తరచూ అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమానాలు నివృత్తి చేయటంలో భాగంగా పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చింది. స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై కోవిడ్ వ్యాక్సిన్ ఏ విధంగానూ ప్రభావితం చేయదని క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయని చెప్పేందుకు ఎలాంటి రుజువులు, శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ బారిన పడుతుండటంతో జనంలో వ్యాక్సిన్ ప్రభావశీలతపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చిన మంత్రిత్వ శాఖ క్లినికల్ ట్రయల్స్ లో ఫైజర్ 100 శాతం మేర ప్రభావశీలతను చాటుకుందని వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొద్ది మంది మాత్రమే వైరస్ బారిన పడుతున్నారని వివరించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..