తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు.. మాస్క్‌ తప్పనిసరి

- March 28, 2021 , by Maagulf
తెలంగాణలో ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు.. మాస్క్‌ తప్పనిసరి

హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్‌-ఎ- బరాత్‌, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్‌లు వరుసగా వస్తున్నాయి. దీంతో ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు.  ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం-2005, సంబంధిత చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్క్‌లు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపిసిలోని సెక్షన్‌ 188 కింద చర్యలు ఉంటాయని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com