ఇంటి నుంచే పనిచేయండి.. 87% సంస్థల నిర్ణయం
- March 30, 2021
కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ని శాశ్వతంగా కొనసాగించేందుకు ఆలోచిస్తున్నాయి. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించిన సర్వేలో 87 శాతం సంస్థలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది. అంతేకాదు కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే వాళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, వీడియో కమ్యూనికేషన్స్ చూపిన పరిష్కారాలపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.
ప్రపంచంలో ఇండియా సహా ఆరు దేశాల్లోని ప్రధాన రంగాలపై వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావాన్ని ఈ సర్వే అధ్యయనం చేసింది. ఇండియా, యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే జరిపిన సంస్థలలో వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు గుర్తించారు. ఇక సర్వేలో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయగా.. అందులో 70 శాతం మంది రిమోట్ వర్కింగ్‌కు అనుకూలంగా ఓటేశారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయింది. అంతేకాదు.. చాలామంది తమ ఉద్యోగాలు కూడా కాపాడుకోగలిగారు. ఒక్క యూరప్‌లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షలమంది ఉద్యోగాలు నిలిచాయి.
తాజా వార్తలు
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!
- ఒకే రోజు 3,206 ట్రాఫిక్ వయోలేషన్స్ నమోదు..!!
- ఒమన్ లో వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!









