యూఏఈ: 3 కొత్త టూరిస్ట్, రెసిడెన్సీ వీసా వివరాలు

- April 01, 2021 , by Maagulf
యూఏఈ: 3 కొత్త టూరిస్ట్, రెసిడెన్సీ వీసా వివరాలు

యూఏఈ:ఈ ఏడాది మూడు కొత్త టూరిస్ట్ వీసా, రెసిడెన్సీ వీసా పథకాలను యూఏఈ.

1.రిమోట్ వర్క్ వీసా, 2. ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా, 3.విదేశీ విద్యార్థులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకునే రెసిడెన్సీ చట్టం

1. రిమోట్ వర్క్ వీసా: విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ లేకుండా దేశంలోకి ప్రవేశించి ఒక ఏడాది పాటు స్టే చేసేందుకు రిమోట్ వర్క్ వీసా ఉపయోగపడుతుంది. అలాగే ప్రత్యేక పరిస్థితులలో వర్చువల్ ఎంప్లాయిమెంట్‌కు ఇది విదేశీయులకు పర్మిట్ ఇస్తుంది. 

2. ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా: ఈ వీసా సందర్శకులను నిర్ధిష్ట ఐదేళ్ల కాల పరిమితిలో అనేకసార్లు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అలాగే ప్రతి విజిట్‌పై 90 రోజుల వరకు ఆ దేశంలో స్టే చేసే వీలు ఉంటుంది. 

3. విదేశీ విద్యార్థులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకునే రెసిడెన్సీ చట్టం: యూఏఈ కేబినెట్ ఇటీవలే రెసిడెన్సీ చట్టాల సవరణకు అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా విదేశీ విద్యార్థులను తమతో పాటు తమ కుటుంబ సభ్యులను యూఏఈకి తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తగిన వసతిని పొందగలిగే వరకు వారు అక్కడే ఉండొచ్చు. 

ఇటీవలి ఈ వీసా పథకాలతో పాటు వైద్య అవసరాలు, పదవీ విరమణ చేసినవారికి ఐదేళ్ల రెసిడెన్సీ, పది సంవత్సరాల గోల్డెన్ వీసా వంటి పలు వీసా, నివాస పథకాలను ప్రస్తుతం యూఏఈ రెసిడెన్సీ వ్యవస్థ కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com