ఘోర రైలు ప్రమాదం..36 మంది మృతి
- April 02, 2021
టైవాన్:టైవాన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.ఈ రైలులో 350 వరకు ఉన్నారు.ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







