తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 16న 'లవ్ స్టోరీ'

- April 02, 2021 , by Maagulf
తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 16న \'లవ్ స్టోరీ\'

హైదరాబాద్:నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'లవ్ స్టోరీ' సినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పి,అమిగో క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 10వ తేదీన జరపబోతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ టాక్ సంపాదించాయి. ప్రత్యేకించి 'సారంగధరియా' పాట స్వీడ్ గా 100 మిలియన్ మార్క్ చేరిన రికార్డ్ సృష్టించింది. పాటల్లాగే సినిమా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని యూనిట్ భావిస్తోంది. మరి వారి నమ్మకాన్ని 'లవ్ స్టోరీ' ఎంత వరకూ నిలబెడుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com