‘వకీల్ సాబ్’ సెన్సార్ పూర్తి
- April 05, 2021పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. కాగా, తాజాగా 'వకీల్‌సాబ్' సెన్సార్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.సెన్సార్ టాక్ అయితే వకీల్ సాబ్‌కు చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ‘పింక్’ సినిమాలో దాదాపుగా ఫైట్స్ ఉండవు కానీ ‘వకీల్ సాబ్’లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లు సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి వకీల్ సాబ్ లో జరిగిన మార్పులు తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే!
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?