'జిసిసి' యాక్షన్‌కి ఇదే సరైన సమయం

- May 31, 2015 , by Maagulf
'జిసిసి' యాక్షన్‌కి ఇదే సరైన సమయం

‘అల్లా మీద నమ్మకం ఉన్న ఏ ఓ ముస్లిం ఇంకో ముస్లిం రక్తాన్ని కళ్ళచూడాలని అనుకోడు. అలాంటిది అత్యంత హేయంగా మసీదులపై దాడులు చేస్తున్నారు తీవ్రవాదం పేరుతో. దీన్ని ఉపేక్షించకూడదు. ఇకపై జిసిసి దేశాలన్నీ తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరు చేపట్టాల్సిందే’ అని అన్నారు ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా మిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా. కువైట్‌, బహ్రెయిన్‌, యూఏఈ, సౌదీ అరేబియాల్లో జరుగుతున్న తీవ్రవాదుల దాడుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్‌ రీజియన్‌లో తీవ్రవాదానికి చోటివ్వకుండా అన్ని దేశాలూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారాయన. అంతర్గత భద్రత సరిగ్గా ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలమన్న ఖలీఫా, గల్ఫ్‌ దేశాల్లో ఎక్కడా తీవ్రవాదులకు చోటు ఉండకూడదంటే తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఒక్కటే మార్గమని సూచించారు.

--యం. వాసుదేవ రావు(బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com