ఆదివారం నెల‌వంక క‌నిపించే అవ‌కాశాలు

- April 10, 2021 , by Maagulf
ఆదివారం నెల‌వంక క‌నిపించే అవ‌కాశాలు

సౌదీ: ఏప్రిల్ 11 ఆదివారం సాయంత్రం నెల‌వంక క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సౌదీ సుప్రీం కోర్టు వెల్ల‌డించింది. కింగ్డ‌మ్ ప్ర‌జ‌ల్లో ఎవ‌రికైనా నెల‌వంక కనిపిస్తే వెంట‌నే స‌మాచారం అందించాల‌ని సూచించింది. ఏ సాధ‌నం లేకుండా నేరుగా క‌ళ్ల‌తో చూసినా, బైనాక్యూల‌ర్ సాయంతో నెల‌వంక‌ను చూసినా వెంట‌నే త‌మకు స‌మీపంలోని కోర్టుకు స‌మాచారం అందించాల‌ని కోరింది. లేదంటే తమకు సమీపంలోని రీజిన‌ల్ సెంట‌ర్స్ లోని అధికారుల‌కు తాము ఏ ప్రాంతంలో నెల‌వంక‌ను చూశారో తెలియ‌జేయాల‌ని..అధికారుల ద్వారా కోర్టుకు స‌మాచారం అందుతుంద‌ని వివ‌రించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com