కోవిడ్ రూల్స్ పాటించ‌కుంటే జైలు శిక్ష‌, జ‌రిమానా

- April 10, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ పాటించ‌కుంటే జైలు శిక్ష‌, జ‌రిమానా

బ‌హ్రెయిన్: ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్ రూల్స్ పాటించి తీరాల్సిందేన‌ని బ‌హ్రెయిన్ ప్రాసిక్యూష‌న్ ఆఫ్ మినిస్ట్రీ సూచించింది.లేదంటే జ‌రిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.కోవిడ్ నిబంధ‌న‌ల‌పై స్ప‌ష్ట‌త ఇస్తూ ప‌బ్లిక్ ప్రాంతాల్లో, కూడ‌ళ్లు, బీచ్ ల‌లో ప్ర‌తి ఒక్క‌రు ఖ‌చ్చితంగా భౌతిక దూరం పాటించాల‌ని వెల్ల‌డించింది.గ‌తేడాది మార్చిలో సూచించిన నిబంధ‌న‌ల మేర‌కు ప‌బ్లిక్ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమికూడ‌ద్ద‌ని వెల్ల‌డించింది. ఒక‌వేళ ఎవ‌రైనా వ్య‌క్తులు కోవిడ్ రూల్స్ పాటించ‌కుంటే వారు BD 5,000 జ‌రిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వ‌స్తుందని హెచ్చ‌రించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com