రెండోసారి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..
- April 16, 2021
బెంగుళూరు: ఇప్పటికే ఓసారి కరోనాబారిన పడిన కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప.. మరోసారి ఆ వైరస్‌కు చిక్కాడు.. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.ఈ విషయాన్ని కర్ణాటక సీఎంవో ప్రకటించింది.తీవ్ర జ్వరంతో బాధపడుతూ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు యడ్యూరప్ప.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఇప్పుడు అక్కడి నుంచి మణిపాల్ ఆస్పత్రికి తరలించనున్నారు.
ఇక, ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఆరోగ్య మంత్రి కె సుధాకర్, బిబిఎంపి కమిషనర్ గౌరవ్ గుప్తా కూడా పాల్గొన్నారు... ఇక,యడ్యూరప్ప.. కోవిడ్ టీకా తొలి డోస్‌ను కూడా మార్చి 12వ తేదీన తీసుకున్నారు.అయినా ఆయన రెండోసారి కోవిడ్ బారినపడ్డారు.. కాగా, 2020 ఆగస్టులో తొలిసారి ఆయనకు కోవిడ్ సోకింది.దీంతో.. ఆగస్టు 2 న మణిపాల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. నెగిటివ్‌గా వచ్చిన తర్వాత ఆగస్టు 10న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు యడ్యూరప్ప.. గురువారం వరకు ప్రచారంలో ఉన్న ఆయన. గత మూడు రోజులుగా జ్వరం, అలసటతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.ఇప్పుడు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. తన కుటుంబ సభ్యులు, క్యాబినెట్ సహచరులు, వ్యక్తిగత సిబ్బందితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న బ్యూరోక్రాట్లు హోం ఐసోలేషన్‌లో ఉండాలని.. వెంటనే కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు సీఎం.
తాజా వార్తలు
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!







