ఉచితంగా ఆయుష్మాన్ కార్డు..
- April 21, 2021
న్యూ ఢిల్లీ: ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ లబ్ధిదారులకు శుభవార్త. ఇక నుంచి మీరు ఉచితంగానే ఆయుష్మాన్ భారత్ కార్డును పొందొచ్చు.ఇంతకు ముందు ఈ కార్డు కోసం రూ.30 చెల్లించాల్సి ఉండేది.కానీ ఇప్పుడు అలా కాదే.ఉచితంగానే ఆయుష్మాన్ కార్డు అందుకోండి.దేశంలోని పేదల కోసం కేంద్రం తీసుకువచ్చిన ప్రత్యేకమైన స్కీమ్ ఆయుష్మాన్ భారత్.ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్న వారికి రూ.5 లక్షల వరకు ఇన్సూ రెన్స్ కవరేజ్ కింద ఆర్థిక సాయం అందుతుంది.ఆయుష్మాన్ లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డు వస్తుంది.కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కార్డు ప్రింట్ తీసుకోవాలి.దీనికి రూ.30 చెల్లించాలి. అయితే ఇప్పుడు.. ఈ కార్డు కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.ఉచితంగానే ఈ కార్డును పేదలకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.ఈ కార్డు ఉన్నవారు హాస్పిటల్స్‌కు వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు.ఆసుపత్రిలో అయ్యే ట్రీట్ మెంట్ కోసం ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.దీంతో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు లభిస్తాయి.
ఈ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే ప్రభుత్వ ఆరోగ్య సెంటర్ లేదా ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ కు వెళ్ళి ఈ స్కీంలో చేరొచ్చు. ఈ పథకంలో చేరాలంటే మీకు అర్హత ఉందో లేదో కూడా వెబ్ సైట్ ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా.. ఆయుష్మాన్ భారత్ కార్డు పీవీసీ కార్డు రూపంలో ఏటీఎం కార్డును పోలి ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు ఈ కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మీకు ఒక వేళ ఈ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







