‘ఎక్స్ఛేంజీ హౌస్’కి 496,000 దిర్హాముల జరీమానా
- April 22, 2021
యూఏఈ: యాంటీ మనీ లాండరింగ్ - ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఇల్లీగల్ ఆపరేషన్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఓ మనీ ఎక్స్ఛేంజ్ సంస్థకు భారీగా జరీమానా విధించింది యూఏఈ సెంట్రల్ బ్యాంక్. మొత్తం 496,000 దిర్హాముల జరీమానా సదరు సంస్థ ఎదుర్కోనుంది. సదరు సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా జరీమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 18న ఈ జరీమానా విధించారు. అయితే, ఆ సంస్థ పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఎక్స్ఛేంజ్ కార్యాలయాలపై ఎప్పటికప్పుడు నిఘా వుంటుందనీ, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు కఠినంగా వుంటాయని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ బ్యాంక్ గతంలో రెండు సార్లు పలు సంస్థలకు ఇలాగే జరీమానాలు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..







