ఢిల్లీ లో దారుణం..ఆక్సిజన్ కొరత..20 మంది మృతి
- April 24, 2021
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ భారీగా ఉన్నది. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నది. కొరతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొరత తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రత అధికంగా ఉన్నది. ఢిల్లీలోని గోల్డెన్ జైపూర్ ఆసుపత్రిలో సరైన సమయానికి ఆక్సిజన్ అందక పోవడంతో 20 మంది రోగులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రానికి 3600 లీటర్ల ఆక్సిజన్ చేరాల్సి ఉంటె,అర్ధరాత్రి 1500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా అయ్యింది. ఏడు గంటల ఆలస్యంగా ఆక్సిజన్ చేరడంతో 20 మంది రోగులు మృతి చెందారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కూడా ఎక్కువ సమయం రాదని, ప్రస్తుతం 200 మంది రోగులు ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నారని, ఆక్సిజన్ అందకుంటే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







