తెలంగాణ: మేడారం మహాజాతర తేదీలు ఖరారు..!

- April 25, 2021 , by Maagulf
తెలంగాణ: మేడారం మహాజాతర తేదీలు ఖరారు..!

తెలంగాణ: తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘ శుధ్ద పౌర్ణమి రోజున నిర్వహించడం ఆనవాతీగా వస్తోంది. 2022 ఫిబ్రవరి 16న గద్దెలపైకి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు రానున్నారు. ఫిబ్రవరి 17న సమ్మక్క అమ్మవారు గద్దెలపైకి రానున్నారు. ఫిబ్రవరి 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19న అమ్మవార్ల వనప్రవేశం చేస్తారు. మరోవైపు కరోనా ఉధృతి నేపథ్యంలో మేడారం పూజారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15వ తేదీ వరకు ఈ నిబంధలను అమల్లో ఉంటాయని పూజారులు ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com