APSSDC నుంచి ఉద్యోగ ప్రకటన...

- April 25, 2021 , by Maagulf
APSSDC నుంచి ఉద్యోగ ప్రకటన...

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.ప్రముఖ ISUZU మోటార్స్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.మొత్తం 100 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27న గుంటూరులో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.ఇందు కోసం అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఎంపికైన వారికి రాయితీపై క్యాంటీన్, రవాణా సదుపాయం ఉంటుంది.14 రోజుల పాటు వసతి సదుపాయం కల్పిస్తారు.ఇతర వివరాలకు 8247766099 నంబరును సంప్రదించవచ్చు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.NEEMS Trainee, Diplomo & Graduation Trainee విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

NEEMS Trainee: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు ITI విద్యార్హత కలిగి ఉండాలి.అలాగే 2018,2019,2020లో పాసైన వారు అర్హులు.అభ్యర్థుల వయస్సు 18-20 ఏళ్లు ఉండాలి.ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.8,950 వేతనం చెల్లించనున్నారు.

Diplomo & Graduation Trainee: డిప్లొమో, ఏదైనా డిగ్రీ, బీటెక్/బీఈ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.2018,2019,2020లో పాసై ఉండాలి.వయస్సు 18–22 ఏళ్ల మధ్యలో ఉండాలి.ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెకలకు రూ.10 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఇంటర్వ్యూలు:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఉదయం 10 గంటలలోగా హాజరు కావాల్సి ఉంటుంది.హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలోని ISUZU సంస్థ ప్రాంగణంలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు జరుగు చిరునామా: Synchro Serve PMKK Centre, D.No: 5-37-154, 2nd Floor, Ambati Mansion, Brodiepet, Guntur.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com