అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్ వేవ్

- May 04, 2021 , by Maagulf
అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్ వేవ్

కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. రెండో దశ వైరస్ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావం ఉందని ఓ పరిశోధనల్లో వెల్లడైంది.

ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తుందని సదరు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నాయి.

‘ఈ రెండో దశలో అనేకమంది వైరస్ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం’ అని టీఐఎఫ్ఆర్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సందీప్ జునేజా వెల్లడించారు.

ముంబైలో కరోనా మరణాలు అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్రలో రెండో దశ వైరస్ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com