కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ బోటును ఢీ కొట్టిన పడవ..ముగ్గురు మృతి

- May 07, 2021 , by Maagulf
కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ బోటును ఢీ కొట్టిన పడవ..ముగ్గురు మృతి

బహ్రెయిన్: అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న కొందరు వ్యక్తులు..తమ పడవతో కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ పడవను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారు కోస్ట్ గార్డ్ సిబ్బందిగా తెలుస్తోంది. షహ్రాఖాన్ బీచ్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్న వారిని నిలువరించేందుకు కోస్ట్ గార్డ్ టీం ప్రయత్నించింది. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు కోస్ట్ గార్డ్ బోటును తమ పడవతో ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులైన ఆసియన్లను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు పలు నిబంధనలు ఉల్లఘించారని, పడవ రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్ ను స్విచ్ఛాఫ్ చేయటం ఇలా పలు నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com