కోవిడ్ వ్యాక్సిన్, చికిత్సకు ఇక ఆధార్ కార్డ్ అవసరం లేదు
- May 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ వైద్యం కోసం ఆధార్ కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే..వ్యాక్సిన్ కోసం ఆరోగ్య సేతు యాప్ లేదా కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.ఆధార్ కార్డ్ లేకపోతే ఇక అంతే సంగతులు.అటు ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే.. కరోనా వైద్యం అందించడం లేదు ఆస్పత్రులు. అయితే ఈ ప్రక్రియతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్యం, మందులు, వాక్సిన్ విషయంలో ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని ఆ సంస్థ తేల్చేసింది. ఆధార్ కార్డ్ లేదని చెప్పి వ్యాక్సిన్ లను ఇవ్వడం నిరాకరించరాదని, అలాగే ఆధార్ కార్డ్ లేకపోతే కరోనా సేవలను అందించలేమని చెప్పకూడదని యూఐడీఏఐ పేర్కొంది. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







