ఎలక్ట్రానిక్ విధానంలో కార్మికుల నిష్క్రమణ సర్టిఫికెట్లు

- May 20, 2021 , by Maagulf
ఎలక్ట్రానిక్ విధానంలో కార్మికుల నిష్క్రమణ సర్టిఫికెట్లు

మస్కట్: మే 23 నుంచి యజమానులు, తొలగింపబడ్డ కార్మికులకు సంబంధించిన నిష్క్రమణ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పొందవచ్చునని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సహకారంతో రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు పౌరులకు సులభతరమైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.యజమానులు లేదా వారి ప్రతినిథి ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన అవసరం లేకుండా, ఎలక్ట్రానిక్ విధానంలోనే తొలగింపబడ్డ ఉద్యోగులకు సంబంధించి ఒమన్ విమానాశ్రయాల వద్ద నిష్క్రమణ సర్టిఫికెట్ల ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆదివారం మే 23 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com