18 ఏళ్లు నిండి, వ్యాక్సిన్ తీసుకున్న వారికే మసీదుల్లోకి అనుమతి

- May 21, 2021 , by Maagulf
18 ఏళ్లు నిండి, వ్యాక్సిన్ తీసుకున్న వారికే మసీదుల్లోకి అనుమతి

బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్న బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మసీదుల్లోకి భక్తుల అనుమతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి వ్యాక్సిన్ తీసుకున్న 18 ఏళ్లకు పైబడిన వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించనున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది.దీనికి సంబంధించి సున్నీ, జాఫరీ ఎండోమెంట్ లతో సమీక్షించిన తర్వాత జాతీయ టాస్క్ ఫోర్స్ సూచనలకు అనుగుణంగా ప్రస్తుత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ప్రార్థనలతో పాటు తక్కిన రోజుల్లోనూ రోజువారీ ప్రార్థనల సమయంలో భక్తులను పరిమిత సంఖ్యకు కట్టడి చేసేందుకు వీలుగా చేపట్టిన ఈ చర్యలు శుక్రవారం(మే 21) నుంచే అమలులోకి రానున్నాయి. అంటే ఇవాల్టి నుంచి మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లే వారు రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకొని 14 రోజులు పూర్తి అయి ఉండాలని. బీఅవేర్ బహ్రెయిన్ యాప్ https://apps.apple.com/bh/app/beaware-bahrain/id1501478858 లో గ్రీన్ లోగో ఉన్నవారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తారు.ఇస్లామిక్ వ్యవహారాలు,ఎండోమెంట్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అమలుకు సంబంధించి సున్నీ, జాఫరీ ఎండోమెంట్ డైరెక్టరేట్లు పర్యవేక్షిస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com