కోవిడ్ రూల్ బ్రేక్..500 మందిపై చట్టపరమైన చర్యలు
- May 26, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని ఖతార్ అధికారులు మరోసారి హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం అంటే చట్టవిరుద్ధ చర్యలకు పల్పడుతున్నట్లేనని స్పష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన ఖతార్ అధికారులు...తాజాగా మరో 506 మందిపై చర్యలు తీసుకుంది. ఇందులో 366 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, మరో 52 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించారు. పార్క్ లు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో గుమికూడినందుకు 84 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు తెలిపారు. అలాగే ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఇద్దరు వ్యక్తులపై నమోదు చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వేల కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







