రెండో డోస్ మిస్ అయిన వారికి వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు

- May 26, 2021 , by Maagulf
రెండో డోస్ మిస్ అయిన వారికి వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు

బహ్రెయిన్: కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేసిన బహ్రెయిన్..తొలి డోసును విజయవంతంగా నిర్దేశిత వర్గాలకు అందించింది. అయితే..ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్ తో అనుకున్న సమయానికి వ్యాక్సిన్ దిగుమతి కాకపోవటంతో రెండో డోస్ ఇవ్వటంలో కొంతమేర జాప్యం అనివార్యం అయ్యింది. దీంతో ఇప్పుడు సెకండ్ డోస్ మిస్ అయిన వారిని లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ కేంద్రాలను అలాట్ చేసింది బహ్రెయిన్. ఏవైనా కారణాలతో సెకండ్ డోస్ వ్యాక్సిన్ మిస్ అయిన వాళ్లంతా వ్యాక్సిన్ వారీగా కేటాయించిన కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలంటూ అధికారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
సినోఫార్మ్: ముహర్రఖ్ హెల్త్ సెంటర్, ఇషా టౌన్ హెల్త్ సెంటర్, అల్ జల్లఖ్ హెల్త్ సెంటర్, జిద్హాఫ్స్ హెల్త్ సెంటర్.
ఫైజర్ బయోన్టెక్ : ఫస్ట్ డోస్ తీసుకున్న హెల్త్ సెంటర్లలోనే రెండో డోస్ కూడా ఇవ్వనున్నారు.
స్పుత్నిక్ వీ : బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్& కన్వెన్షన్ సెంటర్
అస్ట్రాజెన్కా : అల్హూర హెల్త్ సెంటర్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com