తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
- June 02, 2015
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అంతకు ముందు కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డీజీపీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అమరవీరులకు అంజలి ఘటించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









