తైఫ్ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు ప్రారంభం

- June 04, 2021 , by Maagulf
తైఫ్ ప్రాంతంలో భారీ ప్రాజెక్టులు ప్రారంభం

సౌదీ అరేబియా: తైఫ్ ప్రాంతంలో 318 మిలియన్ సౌదీ రియాల్ విలువైన ప్రాజెక్టుల్ని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ తౌఫిక్ అల్ రబియా ప్రారంభించారు. వైద్య రంగానికి సంబంధించి ఎంతో విలువైన ప్రాజెక్టులు ఇవి. ఈ కార్యక్రమానికి గవర్నర్ సాద్ బిన్ మక్బిల్ అల్ మైమోని కూడా హాజరయ్యారు. ఐ స్పెషలిస్ట్ సెంటర్ - కింగ్ అబ్దుల్ అజీజ్ హాస్పిటల్, ఆంకాలజీ సెంటర్ మరియు స్మార్ట్ ఫార్మసీ ప్రాజెక్టుల్ని కింగ్ ఫైజల్ మెడికల్ కాంప్లెక్స్, అలాగే చిన్నారుల రిహాబిలిటేషన్ సెంటర్ ప్రాజెక్టు వీటిల్లో వున్నాయి. అందరికీ అత్యాధునిక వైద్య సేవల్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు మినిస్టర్ వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com