చికెన్ చట్ పట్
- June 06, 2021
కావాల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ ముక్కలు: 500 గ్రా., గరంమసాలా: 5 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద: 25 గ్రా., రిఫైన్డ్ ఆయిల్: 50 గ్రా., ఉల్లిపాయలు: 100 గ్రా., కారంపొడి: ఒక టీస్పూన్, పెరుగు: 100 గ్రా., ఉప్పు: తగినంత, ఫుడ్ కలర్: చిటికెడు
తయారుచేయు విధానం :
ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లంవెల్లుల్లి మిశ్రమం, కారంపొడి, ఉప్పు, గరంమసాలా, ఫుడ్ కలర్ అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు నానబెట్టండి.
ఇప్పుడు ఒక బాణలిలో నూనెపోసి కాగిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేడిచేయండి. ఆ తర్వాత మసాలాలో నానబెట్టిన చికెన్ ముక్కల్ని కలిపి బాణలిలోని నీళ్లన్నీ ఆవిరైపోయేంతవరకు ఉడికించి పొడిగా కొద్దిసేపు ఫ్రై చేయండి. అంతే వేడివేడి చికెన్ చట్ పట్ తయారు.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!