పలు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం
- March 07, 2016
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, భోపాల్, లఖ్‌నవూ, జయ, ఛండీగఢ్‌లో అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలు హెచ్చరించాయి. గుజరాత్ ద్వారా కొంతమంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని నిఘావర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని, భద్రత కట్టుదిట్టం చేయాలని గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.దేశ భద్రతపై సమీక్షించేందుకు ఈరోజు దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు, ఎన్ఎస్జీ చీఫ్, హోంమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









