కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ స్వాగతం

- March 07, 2016 , by Maagulf
కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ స్వాగతం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఆత్మీయ స్వాగతంపలికారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారులకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు ఉభయకుశలోపరి అనే రీతిలో ఒప్పందాలు ఉండాని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు. ఒప్పందానికి అంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కీలక ఒప్పందాలు చేసుకొనేందుకు సీఎం కేసీఆర్‌ బృందం ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ సహా ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com