యెమెన్ లో మ్రుత్యవాత పడ్డ ఇద్దరు భారతీయులు..

- March 07, 2016 , by Maagulf
యెమెన్ లో మ్రుత్యవాత పడ్డ ఇద్దరు భారతీయులు..

లనౌకలో అగ్ని ప్రమాదం మరో ముగ్గురికి గాయాలు దిల్లీ: యెమెన్‌ అల్‌సదాలో ఓ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు నావికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సోమవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మహేశ్‌ కుమార్‌ రాజగోపాల్‌, దీపు లతికా మోహన్‌లు మృతిచెందగా.. మంత్రి ట్విటర్‌లో సంతాపం తెలిపారు. గాయపడిన ముగ్గురు భారత నావికులు ఒమన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారిలో చెన్నైకి చెందిన అతుల్‌ బోర్కర్‌ పరిస్థితి విషమంగా ఉండగాఖ్‌నవ్‌, ఘజియాబాద్‌లకు చెందిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులకు అన్ని విధాలుగా భారత యంత్రాంగం సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com