హైదరాబాద్: ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు

- June 20, 2021 , by Maagulf
హైదరాబాద్: ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయి. ఇదేసమయంలో సర్వీసుల వేళల్లో కొంచం మార్పులు చేశారు. రేపటి నుంచి నుంచి మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని. అయితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కె.వి రెడ్డి(MD & CEO, L&T Metro Rail (Hyderabad)) వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com