బోర్డింగ్ పాసులతో హెల్త్ యాప్ అనుసంధానం: సౌదీ ఏవియేషన్ అథారిటీ
- June 21, 2021రియాద్: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), డొమెస్టిక్ విమానాలకు సంబంధించి బోర్డింగ్ పాసుల జారీ ప్రక్రియను తవకల్నా యాప్ ద్వారా ‘హెల్త్ స్టేటస్’కి లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది. యాప్ ద్వారా ‘ఇమ్యూన్’ లేదా ‘ఇమ్యూన్ బై ఫస్ట్ డోస్’ లేదా ‘ఇమ్యూన్ బై రికవరీ’ లేదా, ‘నో రికార్డ్ ఆఫ్ ఇన్ఫెక్షన్’ అనే స్టేటస్ వున్నవారికి బోర్డింగ్ పాసుల్ని మంజూరు చేస్తారు. ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ అలాగే నేషనల్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. గత ఏడాది తవక్కల్నా యాప్ గత ఏడాది ప్రారంభించారు కరోనా నేపథ్యంలో. కాగా, విదేశీ ప్రయాణీకులు సౌదీ అరేబియా రావాలనుకుంటే, కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ డేటాను వారు బయల్దేరే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది గల్ఫ్ దేశాలకు చెందిన ప్రయాణీకులకూ వర్తిస్తుంది. కొత్త వీసాలు కలిగినవారికి, రెసిడెంట్స్ అలాగే వారి కంపానియన్స్ కోసం ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?