గోల్డెన్ రెసిడెన్సీ పొందినవారికి వర్క్ పర్మిట్ల జారీ

- July 02, 2021 , by Maagulf
గోల్డెన్ రెసిడెన్సీ పొందినవారికి వర్క్ పర్మిట్ల జారీ

యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, గోల్డెన్ రెసిడెన్సీ పొందినవారికి వర్క్ పర్మిట్ల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. మూడు ప్రధాన విభాగాల్లో ఈ వర్క్ పర్మిట్లను జారీ చేస్తారు. ఉద్యోగం లేకుండా వుండి, ఓ ఎంప్లాయర్ వద్ద పనిచేసేందుకు సిద్ధంగా వుండి గోల్డెన్ వీసా పొందినవారు, గోల్డెన్ వీసా కలిగి వుండి కొత్త ఎంప్లాయర్ వద్ద పనిచేయాలనుకున్నవారు, గోల్డెన్ రెసిడెన్సీ కలిగి వున్న వ్యక్తికి పని ఇవ్వడానికి ఓ ఎంప్లాయర్ సిద్ధంగా వున్నప్పుడు.. ఈ వర్క్ పర్మిట్లను జారీ చేస్తారు. తమ పేరెంట్స్ రెసిడెన్సీ మీద డిపెండ్ అయినవారికి జారీ చేసే వర్క్ పర్మిట్లు, కాంట్రాక్టుల తరమాలోనే రూల్స్ వీరికి కూడా వర్తిస్తాయి. యూఏఈ చట్టాలకు అనుగుణంగా ఎంప్లాయర్ మరియు వర్కర్ల మధ్య కాంట్రాక్టులు, పర్మిట్లకు అనుమతులుంటాయి. దేశం వెలుపల వర్తించే ఫీజులు అలాగే రెన్యువల్ పీజులు, వర్క్ పర్మిట్లలో మార్పులు వంటి వాటికి సహజంగా వర్తించే ఫీజులే ఇక్కడా వర్తిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com