కువైట్ లోకి ఎంట్రీకి కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన డీజీసీఏ
- July 28, 2021
కువైట్: అంతర్జాతీయ ప్రయాణాలపై అన్ని విమానయాన సంస్థలకు కువైట్ డీజీసీఏ కొత్త సర్క్యూలర్ ను జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని పౌరులు, ప్రవాసీయులు అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించ కూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కువైట్ మొబైల్ యాప్ లో గ్రీన్ కలర్ స్టేటస్ ఉన్న పౌరులకు మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులు, ప్రత్యేక అనుమతులు ఉన్న వారికే మినహాయింపు ఉంటుంది. ఇక ప్రవాసీయులు, పర్యాటకుల ప్రయాణాలపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ప్రవాసీయులు కువైట్‌లోనే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని, ఇమ్యూన్, కువైట్ మొబైల్ యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉండాలి. అలాగే ష్లోనిక్, కువైట్ మొసఫర్ యాప్ లో తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇతర దేశాల్లోనే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లైతే ప్రయాణానికి ముందే క్యూఆర్ కోడ్ కలిగిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ ఫార్మెట్లలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలి. సర్టిఫికెట్ వివరాల తనిఖీ తర్వాత మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వచ్చాకే ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు. అలాగే ష్లోనిక్, కువైట్ మొసఫర్ యాప్ లో తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ నెగటీవ్ సర్టిఫికెట్ ఉండాలి. కువైట్ చేరుకున్నాక వారం పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..భారత్ నుంచి కువైట్ కు నేరుగా ఫ్లైట్ సర్వీసులపై డీజీసీఏ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









