హైదరాబాద్ లో ఫ్రీ వైఫై
- August 05, 2021
హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇకపై పనిమీద బయటకు వెళ్లినవారు వై-ఫై లేదని బాధపడాల్సిన అవసరం లేదు. 45 నిమిషాలపాటు ఉచితంగా వై-ఫైని ఉపయోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మూడు వేల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి కేటీఆర్ లాంఛనంగా దీన్ని ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వై-ఫై ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని వారితో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు. తానన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వై-ఫై అని పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వై-ఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు బాల మల్లాది చెప్పారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







