తుపాన్ అనంతర పునిర్మాణ పనులలో నిమగ్నమైన ఎటిసలాట్

- March 12, 2016 , by Maagulf
తుపాన్ అనంతర పునిర్మాణ పనులలో నిమగ్నమైన ఎటిసలాట్

తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం సరిదిద్దుకోనేందుకు ఎటిసలాట్ టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నిమగ్నమయ్యంది. గత మూడు రోజుల క్రితం తీవ్రమైన తుపాను అబుధాబిని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీవర్షం...బలమైన గాలులు ఎన్నో ఆస్తులనునష్ట పరిచాయి.  ఎటిసలాట్ ప్రధాన కార్యాలయ భవనం పై భాగాన గోళాకార నిర్మాణం శిధిలమై ప్రమాదకరంగా మారిందని  కనుక తక్షణమే దానిని తొలగించాలని  జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశించింది. ఈ గోళం ఉపసంహరించే విధంగా ఏదైనా  ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయా అని ఎటిసలాట్ టెలికాం సంస్థను అధికారులు అడిగారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎటిసలాట్ ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు  చర్చించడానికి రాత్రిపూట సమావేశాలు నిర్వహించారు. జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంటూ తుపాను తర్వాత  ప్రధాన రహదారులు మరియు అంతర్గత రహదారులు తెరవలేదని, ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ పెరగడంతో  ఈ మార్గాలను తిరిగి తెరవక తప్పదని అన్నారు. అయెతే, ఎటిసలాట్ ప్రధాన కార్యాలయ భవనం పై భాగాన గోళాకార నిర్మాణం శిధిలమై ప్రధాన రహదారిపై కూలిపోయే అవకాశం ఉండి ప్రమాదాలు జరిగవచ్చని గురువారం ఒక ఉన్నత అధికారి పేర్కొన్నారు. బంతి ఆకారంలో ఉన్న ఈ  నిర్మాణం ఫఉతొఉహ్  అల్ ఖైర్ సెంటర్ పక్కన ఉంది.  ఎటిసలాట్ భవనం బలమైన గాలులు ప్రభావంతో ప్రమాదంలో పడినట్లు గల్ఫ్ న్యూస్ కు  ఆయన చెప్పారు. ఈ  భవనం షేక్ రషీద్ బిన్ సయీద్ వీధి సమీపంలో  రెండు ఎటిసలాట్ భవనాలు (ప్రముఖంగా విమానాశ్రయం రోడ్ గా సూచిస్తారు) ఇందులో ఒక.భవనం పార్కింగ్ నిర్వహణ తరువాత కొన్ని రోజులలో నిర్మాణం చేపడతారు

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com