తుపాన్ అనంతర పునిర్మాణ పనులలో నిమగ్నమైన ఎటిసలాట్
- March 12, 2016
తుపాను మిగిల్చిన తీవ్ర నష్టం సరిదిద్దుకోనేందుకు ఎటిసలాట్ టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నిమగ్నమయ్యంది. గత మూడు రోజుల క్రితం తీవ్రమైన తుపాను అబుధాబిని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీవర్షం...బలమైన గాలులు ఎన్నో ఆస్తులనునష్ట పరిచాయి. ఎటిసలాట్ ప్రధాన కార్యాలయ భవనం పై భాగాన గోళాకార నిర్మాణం శిధిలమై ప్రమాదకరంగా మారిందని కనుక తక్షణమే దానిని తొలగించాలని జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశించింది. ఈ గోళం ఉపసంహరించే విధంగా ఏదైనా ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయా అని ఎటిసలాట్ టెలికాం సంస్థను అధికారులు అడిగారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎటిసలాట్ ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు చర్చించడానికి రాత్రిపూట సమావేశాలు నిర్వహించారు. జాతీయ అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంటూ తుపాను తర్వాత ప్రధాన రహదారులు మరియు అంతర్గత రహదారులు తెరవలేదని, ప్రస్తుత ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ మార్గాలను తిరిగి తెరవక తప్పదని అన్నారు. అయెతే, ఎటిసలాట్ ప్రధాన కార్యాలయ భవనం పై భాగాన గోళాకార నిర్మాణం శిధిలమై ప్రధాన రహదారిపై కూలిపోయే అవకాశం ఉండి ప్రమాదాలు జరిగవచ్చని గురువారం ఒక ఉన్నత అధికారి పేర్కొన్నారు. బంతి ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం ఫఉతొఉహ్ అల్ ఖైర్ సెంటర్ పక్కన ఉంది. ఎటిసలాట్ భవనం బలమైన గాలులు ప్రభావంతో ప్రమాదంలో పడినట్లు గల్ఫ్ న్యూస్ కు ఆయన చెప్పారు. ఈ భవనం షేక్ రషీద్ బిన్ సయీద్ వీధి సమీపంలో రెండు ఎటిసలాట్ భవనాలు (ప్రముఖంగా విమానాశ్రయం రోడ్ గా సూచిస్తారు) ఇందులో ఒక.భవనం పార్కింగ్ నిర్వహణ తరువాత కొన్ని రోజులలో నిర్మాణం చేపడతారు
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









