పెదకాకాని పీఎస్ నుంచి నారా లోకేశ్ విడుదల
- August 16, 2021
గుంటూరు: గుంటూరులో హత్యకు గురైన రమ్య అనే బీటెక్ విద్యార్థిని కుటుంబాన్ని ఇవాళ టీడీపీ నేతలు పరామర్శించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తిప్పినట్టు తెలుస్తోంది. లోకేశ్ పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. తాజాగా లోకేశ్ ను పెదకాకాని పీఎస్ నుంచి విడుదల చేశారు. విడుదలకు ముందు, పోలీసులు లోకేశ్ తో నోటీసులపై సంతకం పెట్టించుకున్నారు. కాగా పోలీసులు లోకేశ్ ను తమ కాన్వాయ్ లోనే తరలించి, పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్లలో తిప్పినట్టు తెలుస్తోంది. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







