అఫ్గాన్ నుంచి దోహా మీదుగా స్వదేశానికి చేరుకుంటున్న ఇండియన్స్
- August 23, 2021
దోహా: అఫ్గాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.వీలైతే నేరుగా లేదంటే ఇతర దేశాల మీదుగా భారతీయులను తరలిస్తున్నారు.ఇందులో భాగంగా కాబూల్ నుంచి దోహాకు తరలించిన భారతీయుల్లో మొదటి బ్యాచ్ ను స్వదేశానికి తరలించారు.135 మందితో కూడిన విమానం దోహా నుంచి భారత్ కు వెళ్లినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.కాబూల్ నుంచి నేరుగా భారత్ కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో ముందుగా ఖతార్ కు తరలించిన అక్కడి నుంచి స్వదేశానికి పంపిస్తున్నారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ తరలింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. గత శనివారం దోహా నుంచి ఇండియన్స్ బయల్దేరిన వీడియోను ట్వీట్ ద్వారా షేర్ చేసింది. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు దోహదపడిన ఖతార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలాఉంటే ఆగస్ట్ 22న అఫ్గాన్ నుంచి దాదాపు 500 మంది వివిధ గమ్యస్థానాల నుంచి భారత్ కు క్షేమంగా చేరుకున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం









