భారత్ కరోనా అప్డేట్
- August 23, 2021
న్యూ ఢిల్లీ: భారత్ దేశం ఊపిరి పీల్చుకుంటోంది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు 19 శాత మేర తగ్గి 25 వేలకు చేరాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 25,072 మంది మహమ్మారి బారిన పడగా 389 మంది మృత్యువాతకు గురయ్యారు. మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరాయి. కొద్ది రోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. మరోపక్క నిన్న కేవలం 7,95,543 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఱ్య 58.25 కోట్లకు చేరింది.
తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్‌లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









