కేరళలో విజృంభిస్తున్న కరోనా
- August 27, 2021
తిరువనంతపురం: భారత్‌లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ తగ్గిపోతుందని అనుకున్నా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఇక కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.కేసులు భారీగా నమోదవుతున్నాయి.ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, 200 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఓనం ఫెస్టివల్ తరువాత ఈ పరిస్థితి నెలకొన్నది. గురువారం రోజున 30,007 కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం కేరళలో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రతీ వందమందిలో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో కరోనా రెండో దశ పీక్స్ దశలో ఉన్న సమయంలో కేరళలో 20 నుంచి 30 వేల వరకు కేసులు నమోదయ్యేవి.రెండో దశ నుంచి కోలుకున్నామని చెబుతున్న సమయంలో కూడా అదేవిధంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









