"దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోము": జో బైడెన్
- August 27, 2021
అమెరికా: ఆఫ్ఘానిస్తాన్ లో నిన్న జరిగిన జంట పేలుళ్ల కారణంగా దాదాపు 60 మందికి పైగా చనిపోగా, 150 మందికి పైగా గాయపడ్డారు, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమెరికా తన బలగాలను తాలిబన్ల సాయంతో తిరిగి పంపిస్తుండగా "ఐసిస్ ఖోరసాన్" గ్రూపు మానవ బాంబుతో విరుచుకు పడింది.
ఈ ఘటన ద్వారా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాబుల్ ఎయిర్ పోర్ట్ దగ్గర జరిగిన జంట పేలుళ్లపై అమెరికా అధక్షుడు జో బిడెన్ ప్రసంగిస్తూ భావోద్వేకానికి గురయ్యాడు.
కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్ల అనంతరం గురువారం వైట్ హౌస్ ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ "ఈ దాడిని అంతతేలికగా వదిలే ప్రసక్తి లేదు.. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లు కాదు.. భాద్యులేవరైనా వదిలే ప్రసక్తి లేదు.. దాడికి కారణమైన వారిని వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. పేలుడులో మరణించిన అమెరికా సైనికులకు కాసేపు మౌనంగా సంఘీభావం తెలిపి, సైన్యం తరలింపులో తన నిర్ణయాలే వల్ల ఆలస్యం జరిగిందని, జరిగిన నష్టానికి తానే భాద్యత వహించుకున్నాడు.
తాలిబన్ల సహకారంతోనే సైన్యాన్ని పౌరులను అక్కడి నుండి తరలిస్తామని, ఈ దాడి వలన తరలింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండబోదని, అనుకున్న సమయం వరకు (ఆగస్టు 31) ప్రక్రియ పూర్తి అవుతుందని బిడెన్ పేర్కొన్నాడు.
ఈ జంట పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు గాయపడగా, 18 మంది గాయపడ్డారు. వీరితో పాటు చిన్న పిల్లలు, ఆఫ్ఘన్ ప్రజలు మాత్రమే కాకుండా తాలిబన్లు కూడా గాయపడ్డారు. ఇదిలా ఉంటే..గ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ ఎయిర్‌పోర్ట్ అబ్బే గేట్ వద్ద మరియు బారోన్ హోటల్ వద్ద మరో బ్లాస్ట్ జరగడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్‌లే టార్గెట్..సైడ్‌వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









