కాబుల్ దాడికి అమెరికా ప్రతీకారం..
- August 28, 2021
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చివురుటాకులా వణికిపోతోంది. ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు దాడులతో హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. ఈ బాంబు దాడిలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 180 దాటిపోగా.. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు ముష్కరులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వార్నింగ్ ఇస్తోంది.
ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం అమెరికా బలగాల ఆధ్వర్యంలోనే ఉండగా.. ఎయిర్‌పోర్టు వెలుపల, అక్కడ పోటెత్తుతున్న జనాన్ని సాయుధ తాలిబన్లు నియంత్రిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పినప్పుడల్లా వారు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. దాడులు జరిగే ప్రమాదముందని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా.. కాబుల్ విమానాశ్రయానికి జనం పోటెత్తుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ “ప్లానర్”పై వైమానిక దాడి చేసింది అమెరికా. ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై అమెరికా వాయుసేన బాంబుల వర్షం కురిపించాయి. కాబూల్ పేలుళ్లు జరిగిన 48 గంటల తర్వాత నంగహర్‌లో ఇస్లామిక్ స్టేట్ అటాక్ ప్లానర్‌పై దాడి చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ మిలటరీ శనివారం స్పష్టంచేసింది. కాబూల్ పేలుళ్ల సూత్రధారి అయిన నంగహర్ లోని కీలక ఐసిస్ ఖోరాసన్ సభ్యుడిపై అమెరికా సైనికులు జరిపిన వైమానిక దాడిలో అతను మరణించాడని అమెరికా వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







