దుబాయ్‌ రోడ్లపై మల్టీపర్పస్‌ పోలీస్‌ కెమెరాలు

- March 14, 2016 , by Maagulf
దుబాయ్‌ రోడ్లపై మల్టీపర్పస్‌ పోలీస్‌ కెమెరాలు

దుబాయ్‌ పోలీసులు అడ్వాన్స్‌డ్‌ మల్టీ పర్పస్‌ రోడ్‌ కెమెరాలను అభివృద్ధి చేశారు. ఒకేసారి ఎనిమిది ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించేలా వీటిని రూపొందించారు. సీట్‌ బెల్ట్‌ లేకుండా వాహనాల్ని నడుపుతున్నవారినీ, అలాగే అతి వేగంతో ప్రయాణించే వాహనాల్నీ, హార్డ్‌ షోల్డర్‌ వయొలేటర్స్‌నీ ఈ కెమెరాలతో ఒకేసారి గుర్తించవచ్చు. గత ఏడాది ఎమిరేట్స్‌ రోడ్లపై విజయవంతంగా ఈ కెమెరాని పరీక్షించారు. ఈ కెమెరాలో 70,000 లేజర్‌ లైన్స్‌ ఉంటాయి. వీటి ద్వారా హై యాక్యురసీతో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనని గుర్తించవచ్చని దుబాయ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ చీఫ్‌ కల్నల్‌ సైఫ్‌ అల్‌ మజ్రోయ్‌ చెప్పారు. కెమెరాలను ఏర్పాటు చేసినప్పటిఉంచీ 30,000 ఉల్లంఘనల్ని అవి రికార్డ్‌ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com