అక్రమంగా మద్యం తరలింపు ప్రయత్నం..8 మంది అరెస్ట్

- September 04, 2021 , by Maagulf
అక్రమంగా మద్యం తరలింపు ప్రయత్నం..8 మంది అరెస్ట్

సౌదీ: సౌదీ అరేబియాలోకి అక్రమంగా మద్యం తరలించేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ & అల్-బాతా పోర్టులో మొత్తం 66,312 మద్యం బాటిళ్లను కింగ్‌డమ్‌లోకి అక్రమంగా తరలించేందుకు నిందితులు ప్రయత్నించారు.అధికారుల అప్రమత్తతో నిందితుల ప్రయత్నం బెడిసికొట్టింది.ఆరెంజ్ జ్యూస్, బాటిల్ డ్రింకింగ్ వాటర్, మెషిన్ ఫిల్టర్ సంచులలో మద్యం సీసాలు దాచినట్లు ZTCA వెల్లడించింది.మద్యం బాటిళ్లను సీజ్ చేసిన అధికారులు 8 మందిని అరెస్ట్ చేశారు.వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com