యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాలు..
- September 04, 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 23 ఖాళీలకు గాను అసిస్టెంట్ డైరెక్టర్–02, అగ్రికల్చర్ ఇంజనీర్–01, అసిస్టెంట్ జియాలజిస్ట్–20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ డిగ్రీ(బోటనీ/ప్లాంట్ పాథాలజీ)లో ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా కనీసం ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు.
* అగ్రికల్చర్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 33ఏళ్లు మించకూడదు.
* అసిస్టెంట్ జియాలజిస్ట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు.
వివరాలు...
* అర్హత, ఆనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి.. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 19-09-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://www.upsconline.nic.in/
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









