సీటిమార్ సెన్సార్ పూర్తి..
- September 04, 2021
హైదరాబాద్: దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది.యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. దిగంగన సూర్యవంశీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోన్నారు. పవన్ కుమార్ సమర్పణలో సిల్వర్ స్ర్కీన్ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కాగా, గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా ఆడలేకపోయింది. చాలా కాలంగా సక్సెస్ లేని గోపీచంద్ కు ఈ సారైనా హిట్టు కొట్టి సీటీమార్ అనిపిస్తాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









