తారాసుద్+తో అందుబాటులోకి మరిన్ని సేవలు
- September 05, 2021
ఒమన్: పలు ప్రభుత్వ సేవలు, కోవిడ్, కోవిడ్ వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన తారాసుద్ + యాప్ ను అప్ డేట్ చేసినట్లు ఒమన్ వెల్లడించింది. కొత్త అప్ డేట్ తో కోవిడ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, ఫ్రొఫైల్ ఎడిటింగ్ ఇలా అన్ని సేవలను పొందవచ్చని వివరించింది. తారాసుద్+ అప్ డేట్ యాప్ ద్వారా వ్యాక్సిన్ డేటాను తెలుసుకోవచ్చు. అలాగే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను చెక్ చేసుకోవచ్చు. హోం పేజ్ లోని క్యూఆర్ కోడ్ తో సర్టిఫికెట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే పాస్ పోర్ట్ నెంబర్ మాడిఫై చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నెంబర్ ను డీలింక్ చేసి కొత్త నెంబర్ ను అప్ డేట్ చేయవచ్చు. అలాగే పిల్లలు, ఇంటి సహాకుల ప్రొఫైల్ ను విభజించొచ్చు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్