జర్మనీలోని బెర్లిన్‌లో బాంబు పేలుడు

- March 15, 2016 , by Maagulf
జర్మనీలోని బెర్లిన్‌లో బాంబు పేలుడు

జర్మనీలోని బెర్లిన్‌లో బాంబు పేలుడు సంభవించింది. చార్లెట్టెన్‌బర్గ్‌ నుంచి బెర్లిన్‌ వెళ్తుండగా రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి కారు పేలింది. ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. పేలుడు కారణంగా కారు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు అరకిలోమీటరు వరకు కారు భాగాలు ఎగిరి పడ్డాయి. కారులో పేలుడు పదార్థాలు అమర్చడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఘటనలో ఇంకెవ్వరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం కారు మరో కారులోకి దూసుకుపోయిందని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com